ఈస్టిండియా కంపెనీలా బీజేపీ

-సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
– సీడ్ల్యుసీ సభ్యులు గిడుగు రుద్రరాజు

విజయవాడ: చండీఘర్ మేయర్ ఎన్నికకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీడ్ల్యుసీ సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కమలమ్మలతో కలిసి.. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

బీజేపీ చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు ప్రజలందరికీ తెలిసాయని ఆయన తెలిపారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న విధానాన్ని గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అందరికీ చెబుతూనే ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉందని తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ., దేశంలోని పార్టీలను ఆక్రమించడంలో.. గతంలో భారత దేశాన్ని ఆక్రమించిన ఈస్ట్ ఇండియా కంపెనీలా మారిందని గిడుగు రుద్రరాజు విమర్శించారు.

ఆర్టికల్ 370., లోక్ సభలో 370 సీట్లు అంటూ విలువలులేని రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ని., స్థానికంగా బీజేపీకి వ్యతిరేంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు.