17 నుంచి బీజేపీ సేవా కార్యక్రమాలు

– మీడియా రాష్ట్ర ఇన్‌చార్జి నాగభూషణం

విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఈ నెల 17వ తేదీ నుంచి సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు ఆ పార్టీ మీడియా రాష్ట్ర ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రారంభమవుతాయని 19తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. 18 నంచి 24 వరకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిసరాల శుభ్రత, 23 ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభం సందర్భంగా 60 ఏళ్ళు పైబడిన వయసుగల మహిళలందరికీ ఉచిత్ ఆరోగ్య శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు అక్టోబర్‌ రెండో తేదీ వరకు జరుగుతాయని తెలిపారు.