వస్త్రాలు పంపిణీ చేసిన బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ

విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ వస్త్రాలు కిట్టు లను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ జన్మదినోత్సవ వేడుకలు లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయం సమావేశ మందిరం లో పారిశుద్ధ్య కార్మికుల కు వస్త్రాలు కిట్టు ను బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యాలయం ఇంఛార్జి శివా మకుటం తదితరులు పాల్గొన్నారు.