అతి భయంకర బాడీ బిల్డర్ 36 ఏళ్ళ వయసులో మృతి!

బెలారస్: ప్రతీ రోజూ 2.5 కిలోల మాంసం ఆరగించి, ప్రపంచంలోనే అతి భయంకరమైన బాడీ బిల్డర్ గా పేరుపొందిన ఇల్లియా యెఫిమ్ చిక్ 36 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని వీడాడు. గుండెపోటుకు గురైన అతను, ఆపై కోమాలోకి వెళ్ళి కొద్ది రోజులకు మృతి చెందినట్టు సమాచారం.

రోజుకు 16,500 కేలరీల ఆహారం తీసుకుంటానని, ఇందులో 2.5 కిలోల మాంసం కూడా ఉంటుందని గతంలో ఇల్లియా వెల్లడించాడు. రోజుకు ఏడు సార్లు తింటాను అని తెలిపారు. ఆరు అడుగులకు పైగా పొడవు ఉండే 155 కేజీలు బరువు ఉండేవాడు.