మళ్లీ చెల్లికి పెళ్లిలా దశాబ్ది ఉత్సవాలా?

-డైలీ లేబర్‌లా…డైలీ ప్రభుత్వం నడుస్తోంది
-సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో పైరవీలు మొదలయ్యాయి
-అన్ని వడ్లకు బోనస్‌ ఇవ్వకుంటే బాక్సులు బద్దలే
-తక్షణమే ఫీజు రీయింబర్స్‌, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి
-డీఏలు విడుదల చేసి పీఆర్‌సీ ప్రకటించాలి
-బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్‌

హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేత బూర నర్సయ్య గౌడ్‌ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలు ఏమీ పీకుతారనుకుంటే పొరపా టని, నమ్మకద్రోహం చేస్తే సహించరని వ్యాఖ్యానించారు. ఇలాంటి అహంకా రులు చాలామంది కాలగర్భంలో గడిచిపోయారని వ్యాఖ్యానించారు. తెలంగా ణలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిపై దృష్టిపెట్టాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌ కింద రూ.7500 కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని అడిగితే కేసీఆర్‌ను అడగమని చెబుతున్నారు. మరి కేసీఆర్‌ హయాంలో చేసిన కాంట్రా క్టర్లకు 4 వేల కోట్ల పెండిరగ్‌ బిల్స్‌ ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. బకా యిలు చెల్లించాలని, విద్యార్థుల ఆగ్రహానికి గురికావొద్దని సూచించారు.

ఉద్యోగ సంఘాలతో ఎప్పుడైనా మాట్లాడారా?
రూ.1400 కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయి. దాంతో రోగులకు వైద్యం అందడం లేదన్నారు. పది లక్షల ఆరోగ్య శ్రీ ఎక్కడ అమలు అవుతుందని ప్రశ్నించారు. మోదీ ఎయిమ్స్‌లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. రూ.10లకే రూ.10 లక్షల సర్జరీ చేస్తున్నారు. ఉద్యోగస్తుల 4 విడతల డీఏలు పెండిరగ్‌లో ఉంది. రేవంత్‌ ఉద్యోగ సంఘాలతో ఎప్పుడైనా మాట్లాడారా? పీఆర్‌సీ ఊసే లేదు. వెంటనే బాకీ ఉన్న డీఏలు విడుదల చేసి పీఆర్‌సీ ప్రకటించాలని కోరారు. జర్నలిస్టు హెల్త్‌ కార్డ్‌ ఇంట్లో ఫ్రేమ్‌ కట్టించుకోవడానికి పనికి వస్తుందని, కార్పొరే ట్‌ ఆసుపత్రుల్లో చెల్లడం లేదన్నారు. మొన్నే కేసీఆర్‌ దశాబ్ది వేడుకలు జరిపారు. మళ్లీ చెల్లికి పెళ్లి మాదిరిగా దశాబ్ది ఉత్సవాలా? డైలీ లేబర్‌లాగా తెలంగాణలో డైలీ ప్రభుత్వం నడుస్తుందని పేర్కొన్నారు. అసలు కేబినెట్‌ మీటిం గ్‌తో వచ్చిన లాభం ఏంటి? అని ప్రశ్నించారు. ఎల్‌వోసీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో పైరవీలు స్టార్ట్‌ అయ్యాయని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే విధానం తేవాలని కోరారు. రూ.500 బోనస్‌ సన్న వడ్లతో స్టార్ట్‌ చేస్తున్నామని కేసీఆర్‌లాగే సన్నా యి నొక్కులు నొక్కుతున్నారని, బోనస్‌ ఇవ్వకుంటే బాక్సులు బద్దలు అవుతాయని హెచ్చరించారు.