ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆదివారం సాయంత్రం దర్శి పట్టణం 6వ వార్డులో పర్యటించారు. ముందుగా పొదిలి రోడ్డు అపార్ట్‌మెంట్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
టీడీపీలో చేరిక
కురిచేడు మండలం పడమటి వీరాయపాలెం గ్రామానికి చెందిన 40 కుటుంబాలు మేకల రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీని వీడి గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. చేరిన వారిలో మేకల రాంబాబు, ఏనుగంటి గోపి, శోభన్ బాబు, మాలెం వెంక టేశ్వర్లు, మేకల శీను, శీలం నాగేశ్వరరావు, మల్లెల మల్లికార్జునరావు, ఆకుమళ్ల మస్తాన్ తదిత రులు ఉన్నారు.