సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ కు మొరపెట్టుకున్న మహిళ
మందపల్లి, మహానాడు: సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ అన్నలూ మీరే నాకు దిక్కు… లేకుంటే మరణమే శరణ్యమంటూ ఓ మహిళ వీడియో విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఆవేదనను వీడియో ద్వారా వెల్లడించింది. అందులో తనను ఒంటరి మహిళ అని చూడకుండా స్థానిక నాయకులు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వారికి ఉన్న ఆస్తిపాస్తులపై కన్నేసి చోటా నాయకులు స్థానికంగా ఉన్నారని ఇద్దరు ఆడపిల్లలతో జీవనం కొనసాగిస్తున్న నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
గత కొన్నాళ్ల కిందట చిన్న అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన నాయకులు మళ్లీ తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపింది. ఫోక్సో కేసులో రాజీకి రమ్మని ఇబ్బంది పెడుతున్నట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు, ఆమె కుటుంబానికి ఆ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని, చనిపోవడం తప్ప వేరే మార్గం లేదంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. తన కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఎదురుచూస్తున్నానంటూ బాధిత బ్రాహ్మణ మహిళ వాపొయింది.