సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరిక
హైదరాబాద్, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ నేతలు, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రేవంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.