కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

కిషన్‌రెడ్డి ప్రకటనను స్వాగతించిన జగ్గారెడ్డి
ప్రభుత్వాలు కూల్చడంలో బీజేపీ ప్రొఫెసర్‌ అని వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మహానాడు : కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్లమెం టు ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్‌లోకి వస్తున్నారని కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనను స్వాగతించారు. ఐదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందని ఆయన మాటలతో తెలిసింది. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు తమకు సంతోషాన్నిచ్చిందని తెలిపా రు. కిషన్‌రెడ్డికి వరి పంటపై అవగాహన లేదని, ధాన్యం మద్దతు ధర నిర్ణయిం చేది కేంద్రమేనని తెలుసుకోవాలని హితవుపలికారు. ప్రభుత్వాలను పడగొట్టడం లో బీజేపీ ప్రొఫెసర్‌ లాంటిదని, ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చలేదని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మ కం ఆ పార్టీలో పోయిందని వ్యాఖ్యానించారు.