Mahanaadu-Logo-PNG-Large

ఏ సెంటర్ లోనైనా చర్చకు సిద్ధం

హరీష్,కేటీఆర్ ఎవరు వస్తారో రండి
హరీష్ ..నీకు చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్
అమర వీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి.. తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పు
2026 పంద్రాగస్టులోగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాం
ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా
ఏడాదిలోగా 65వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు
బీఆరెస్ పార్టీది ప్రస్తుతం బంజారాహిల్స్ బస్టాండ్ లో అడుక్కు తినే పరిస్థితి
– ఖమ్మం జిల్లా వైరా బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వైరా : బావ, బామ్మర్దులు అబద్దాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులు,సంక్షేమ పథకాలపై ఏ సెంటర్ లోనైనా చర్చకు సిద్ధం. హరీష్,కేటీఆర్ ఎవరు వస్తారో రండి… అమరవీరుల స్థూపం వద్దనైనా చర్చకు సిద్ధం. హరీష్ రాజీనామా చెయ్.. ఉప ఎన్నికలో నిన్ను ఓడించి తీరుతాం.

అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు తిరగకుండానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశాం. రూ.31వేల కోట్లతో రైతులను రుణ విముక్తులను చేసాం. పంద్రాగస్టులోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఆనాడు మాట ఇచ్చాం. రైతాంగానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నాం.

27రోజుల్లో 18వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు ఆనాడు సవాల్ చేశారు..హరీష్ రావ్.. నీకు చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్. రాజీనామా చేయకపోతే అమర వీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి.. తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పు.

మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు మేం నిరంతరం కృషి చేస్తున్నాం. ఈ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. బీఆరెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సున్నా సీట్లు ఇచ్చినా.. 7 చోట్ల డిపాజిట్లు పోయినా ఇంకా మీ బుద్ధి మారలేదా? ప్రజలు మిమ్మల్ని మనుషులుగా చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనైనా గెలిపించేవారు కదా? బీఆరెస్ పార్టీది ప్రస్తుతం బంజారాహిల్స్ బస్టాండ్ లో అడుక్కు తినే పరిస్థితి
2026 పంద్రాగస్టులోగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని వైరా గడ్డ నుంచి మాట ఇస్తున్నాం. మున్నేరు నది నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చే బాధ్యత మాది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి డోర్నకల్ నియోజకవర్గానికి వీరభద్రుడి పేరుతో 15టీఎంసీల రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తాం.

ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్నాం.అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఏడాదిలోగా 65వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఖమ్మం జిల్లాలో బీఆరెస్ కు మిగిలింది గాడిదగుడ్దు.

మీరు అండగా ఉంటే.. బీఆరెస్ ను సమూలంగా పెకలించి బంగాళాఖాతంలో విసిరేసే బాధ్యత నేను తీసుకుంటా. తెలంగాణలో బీజేపీకి జాగా లేదు.తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 సీట్లు ఇస్తే.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వాళ్లు గాడిద గుడ్డు ఇచ్చారు..ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బీఆరెస్ కు విసిరిన సవాలుతో నేను ఏకీభవిస్తున్నా.

. అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు ప్రజల కష్టాలు తెలియలేదు. అధికారం పోయాక వాళ్లకు నొప్పి తెలుస్తుంది.బీఆరెస్ అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే బాధ్యత మాది.