Mahanaadu-Logo-PNG-Large

బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి ప్రచారం

సికింద్రాబాద్‌, మహానాడు: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్‌ నగర్‌ నియోజకవర్గం అమీర్‌పేటలో బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిపై ఓటర్లకు వివరించారు. వారికి అడుగడుగునా మంగహారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలో పదేళ్ల పాలనలో హైదరాబాద్‌ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. సనత్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అభిóవృద్ధి కనిపిస్తుంది. మేము ఏం చేశామో చెప్పి ఓట్లు అడుగుతాం. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని కోరారు.