సాక్షిలో వచ్చిన మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యా కథనంపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. వివేకా హత్యలో తన ప్రమేయం లేదని, తాను నార్కో అనాలిసిస్ టెస్టుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. మరి, అవినాష్ రెడ్డి కూడా అతడి ప్రమేయం ఏమీ లేదని నార్కో అనాలిసిస్ టెస్టు చేయించుకోటానికి సిద్ధమా? అని బీటెక్ రవి సవాల్ విసిరారు.
ఈ కేసును సీరియస్ గా తీసుకుంటే అవినాష్ బీజేపీలోకి వెళ్తాడని సునీతతో జగన్ అన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. వివేకాను గొడ్డలితో చంపారన్న విషయం హత్య జరిగిన రోజునే జగన్ కు ఎలా తెలిసిందని నిలదీశారు.
ఈ కేసులో జగన్ ప్రమేయం ఉందన్న విషయం త్వరలోనే బయటికి వస్తుందని, అసలు, వివేకా హత్యను నిందితులు వీడియో తీసి వైసీపీ పెద్దలకు పంపారన్న సమాచారం కూడా ఉందని బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో కొన్ని అంశాలు బయటి ప్రపంచానికి తెలియకముందే జగన్ కు ఎలా తెలిశాయో చెప్పాలని అన్నారు.