కార్యకర్తలకు బుద్దా వెంకన్న వరద సాయం

హైదరాబాద్: విజయవాడ వరద ఉధృతికి చాలా మంది సర్వం కోల్పోయారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, పోరాటాలు చేసిన మా కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారు.ప్రజల బాధలు, కష్టాలు చూసి ఆవేదన కలిగింది. కూలి పనులు చేసుకునే పేదవారు అయితే మొత్తం కోల్పోయారు. నా వంతు బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్ కు ఐదు లక్షల రూపాయలు విరాళం ఇచ్చాను.

ఇప్పుడు టీడీపీ కోసం పని చేసిన నా కార్యకర్తలను ఆదుకునేందుకు ముందుకు వచ్చా. వారి ఇళ్లల్లో టీవీలు, ఫ్రిజ్ లు, ఇతర గృహోపకరణాలు నష్టపోయారు. వారందరికీ నా సతీమణి బుద్దా భూలక్ష్మి, అల్లుడు కాండ్రేగుల రవీంద్ర ద్వారా ఈ వస్తువులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశా.

నాకు వైరల్ ఫీవర్ కారణంగా హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా.నేను రాలేకపోయినా.. టీడీపీ కోసం పనిచేసిన కార్యకర్తలకు నావంతుగా ఈ సాయం అందిస్తున్నాను ఇంక ఎవరైనా నాతో కలిసి నడుస్తూ పార్టీ కోసం పని చేసి, వరదల్లో నష్టపోతే నా దృష్టికి తీసుకురండి.వారందరికీ తప్పకుండా నా వంతుగా సాయం అందిస్తాను.