బౌద్ధం.. ఎప్పటికీ వాడని వృక్షం

ప్రపంచ చరిత్రలో అశోకుడు నిర్మించినంత అఖండ భారత్ ని ఏ మానవుడు నిర్మించలేదు. క్రీ.పూ.260సం. నాటికే బౌద్ధం జాతీయమతంగా మారింది(మతం అంటే ఇక్కడ నాగరికతకు అనుకూలంగా ఆచరించడం). ప్రపంచ దేశాలలో ఉన్న విద్యార్థులు అందరూ ఈ అఖండ బుద్ధ భారత్ ని చూడాలని,ఇక్కడ విద్యను అభ్యసించాలని,జ్ఞానాన్ని, విజ్ఞాన్ని పొందాలని ఆరటపడేవారు. ధార్మిక ప్రాధాన్యత గల వివిధ కేంద్రాల నుండి బయల్దేరిని బౌద్ధ బిక్షువులు వారి సుత్త,వినయ జ్ఞానాన్ని తీసుకొని బాల్క్ నుండి సిలోన్ వరకు సింధు నది తీరంలోని పట్టాలనుండి గంగానది ముఖద్వారంలోని తములుక్ వరకు గల విశాల భూభాగాన్ని బౌద్ధ బోధనలతో ఈ అఖండ దేశం మార్మోగింది.

అందుకే బౌద్ధం ప్రపంచం గుర్తింపుని పొందింది. సుమారుగా 60 దేశాలలో బౌద్ధం విస్తరించింది. మిగిలిన మతాలు బౌద్ధం కంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చిన వారి వారి మతాల మాదిరిగా హింసను ప్రోత్సహిస్తే ప్రపంచమే బౌద్ధం అయ్యేది. కానీ ప్రకృతికి అనుగుణంగా శాంతిని,కరుణ, దయని కలిగి ఉండటం వల్ల బౌద్ధం ఎప్పటికి వాడని వృక్షంలాగా ఈనాటికి కొత్తగా తళతళ మెరిసిపోతూ ఉంటుంది.

– వేలూరు అంకయ్య