Mahanaadu-Logo-PNG-Large

బూతులు కావాలా…బిట్స్‌ ఫిలాని కావాలా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రచారం
రాకేష్‌రెడ్డి అవకాశాలపై ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ విశ్లేషణ

ఖమ్మం, మహానాడు : నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. ఈ ఎన్నికల క్యాంపెయిన్‌లో బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని స్పష్టంగా వివరించారు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేష్‌రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్‌ ఆయన ఉన్నత విద్యావంతుడు, బిట్స్‌ ఫిలానిలో గోల్డ్‌ మెడలిస్ట్‌ కావడమేనని చెప్పుకొచ్చారు. బిట్స్‌ ఫీలాని అంటే దేశంలోని అన్నీ ఐఐటీలతో సరి సమానమైన విద్యాసంస్థ. అందుకే బీఆర్‌ఎస్‌ తన ప్రచారంలో అర్థమయ్యేలా ప్రశ్నిస్తున్నారు. బిట్స్‌ ఫిలానిలో చదివిన విద్యావంతుడు కావాలా…రోజూ బూతులు మాట్లాడే వారు కావాలా? బండ బూతులు మాట్లాడే వారిని పెద్దల సభకు పంపిస్తారా… ఉన్నత విద్యావంతుడిని పెద్దల సభకు పంపిస్తారా? అని ఆ పార్టీ నిర్వహిస్తున్న ప్రచార సరళిపై విశ్లేషించారు.