వినుకొండ, మహానాడు: నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కాల్ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంను ప్రవేశపెట్టారు. స్థానిక తిమ్మాయపాలెం రోడ్డు “Y” కన్వర్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బ్రోచర్ ను బుధవారం మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు మక్కెన మల్లికార్జున రావు, బీజేపీ నాయకులు మేడం రమేష్, జనసేన పార్టీ సమన్వయకర్త నాగ శ్రీను రాయల్, జనసేన నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు, నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.