ఎన్టీఆర్ జిల్లా మైలవరం, మహానాడు: మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామపంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూరాయ పాలెం, నల్లకుంటలలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు పాల్గొన్నారు.