అమర్నాథ్ వ్యాఖ్యలకు పల్లా కౌంటర్
విశాఖపట్నం, మహానాడు : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధాని ప్రకటిస్తే గాజువాక ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటా అన్న గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై కూటమి నేత పల్లా శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. గంగవరం పోర్టు ప్రభు త్వ వాటా అమ్ముకుని ప్రైవేటీకరణ జరిగినప్పుడు ఎందుకు మంత్రి పదవి నుంచి తప్పుకోలేదని ప్రశ్నించారు. సేలం స్టీల్ ప్లాంటును అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదా అని అడిగారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే ప్రసక్తే లేదని జగన్ ఒక స్టేట్‌మెంట్ ఇవ్వగలడా అని ప్రశ్నించారు. ఇప్పటికీ గంగవరం పోర్టు వద్ద కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఒక్క ప్రభుత్వ అధికారి అయినా వారితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అదే ప్రభుత్వ వాటా ఉంటే మాట్లాడే అవకాశం ఉండేది కదా అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం మీరు చెప్పే కల్లబొ ల్లి మాటలు నమ్మే పరిస్థితిలో గాజువాక ప్రజలు, స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు నిర్వాసితులు నమ్మే పరిస్థితుల్లో లేరని హితవుపలికారు.