ఆదిత్య ఇన్ ఫ్రా అపార్టుమెంట్స్ ఎన్‌వోసీ రద్దు

– రైల్వే శాఖ నిర్ణయం
– పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ వెల్లడి

గుంటూరు, మహానాడు: ఆదిత్య ఇన్ ఫ్రా అపార్టుమెంట్స్ ఎన్.ఓ.సి.ని రైల్వే శాఖ రద్దు చేసిందని పొన్నూరు శాసన సభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో ఏమన్నారంటే… అదే రైల్వే ఎన్‌వోసీని తనకు అన్వయించుకుని గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణం చేస్తున్నారు. నియమ, నిబంధనలు ఉల్లంఘించటం వలనే రైల్వే వారు ఎన్‌వోసీని రద్దు చేశారు. అయినప్పటికీ కార్పొరేషన్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. రైల్వే శాఖ వారు ఇచ్చిన ఎన్‌వోసీ క్యాన్సిల్ ని చేస్తూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారికి కూడా పంపించిన మాట వాస్తవం కాదా?

రైల్వే శాఖ 2023 మే 25న ఎన్‌వోసీ క్యాన్సిలేషన్ కాపీ పంపితే కార్పొరేషన్ వారు ఆనాటి నుంచి నిర్మాణాలను నిలుపుదల చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు? సంవత్సరం క్రితం రైల్వే శాఖ వారి ఎన్‌వోసీ రద్దు ఉత్తర్వులను కార్పొరేషన్ అధికారులు దాచి ఉంచడానికి గల కారణం ఏమిటి ? కార్పొరేషన్ అధికారులు వైలేషన్స్ ఉండే జూలై నెలలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ వేసినట్టు తెలిపారు. ఆ స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఎందుకు బహిర్గతం చేయలేదు. స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఉన్నా కూడా బజరంగ్ అర్బన్ ఇన్ ఫ్రా టెక్ వారు వర్క్ చేయటం వలనే పక్కనే ఉన్న నిర్మాణాలు దెబ్బతిన్నవి.

పక్క ఉన్న నిర్మాణాలు దెబ్బతినుటకు కారకులైన వారిపై చర్యలు తీసుకొని వారి లైసెన్సులు ఎందుకు నిలుపుదల చేయలేదు.

బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారితో కుమ్మక్కైన కార్పొరేషన్ అధికారులు ఎవరు? కార్పొరేషన్ వారికి రైల్వే శాఖ వారు పంపిన ఎన్‌వోసీ కాపీని మాయం చేసి వారికి సహకరించిన వారు ఎవరు? 35 ఏళ్ళ అనుభవం ఉన్న అంబటి మురళికి చట్టబద్దంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా తమ కంపెనీ పేరు మీద అవసరం ఉన్నా లేదని ఏలా భావిస్తారు. ఆదిత్య ఇన్ ఫ్రా కంపెనీ వారు ప్రారంభ దశలో దాఖలు పరిచిన ప్లాన్, కన్స్ట్రక్షన్, స్ట్రక్చర్ లలో, బజరంగ్ ఇన్ఫ్రా పేరు మీద కడుతున్న దానికి తేడా లేదా?

ఆన్లైన్లో ఇతరుల పేరు పై ఎన్‌వోసీ ఉన్న మాట వాస్తవమే కాదా? ఆన్లైన్లో తప్పుడు ద్రువపత్రాలు దాఖలు చేసి మీ పేరు మీద అక్రమ బదిలీ చేశారు. అక్రమంగా మీ పేరు మీదకు బదిలీ చేసుకోవడానికి సహకరించిన సంబంధిత అధికారులపై చర్యలకు సంబంధిత శాఖలను కోరడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కార్పొరేషన్ అధికారులు విడుదల చేసిన గ్రౌండ్ ఇన్ స్పెక్షన్ రిపోర్టులో కూడా రైల్వే శాఖ వారు యన్.ఓ.సి రద్దు గురించి తెలపకపోవటంలో అంతర్యం ఏమిటి ? బజరంగ్ వారు కార్పొరేషన్ అధికారులతో కుమ్మకైనట్టు స్పష్టమవుతున్నది. రైల్వే శాఖ వారు ఎన్‌వోసీ క్యాన్సిల్ అయినప్పటికీ కన్స్ట్రక్షన్ ను కొనసాగించడానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.