మంగళగిరి, మహానాడు: మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో నేడు జరగాల్సిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమం రద్దయింది. భారీ వర్షాలు, వరదలు ఉండడంతో పాటు వరద సహాయక చర్యల్లో అధికారులందరూ నిమగ్నమైయున్నారు. ఈ దృష్ట్యా మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమం రద్దు అయింది. ఎటువంటి గ్రీవెన్స్ ఉండదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించాలని టీడీపీ శాసనమండలి సభ్యులు, కేంద్ర కార్యాలయం కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.