క్యాన్సర్ పేషంట్ గౌస్ కి రూ. 70 వేల సాయం

నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట పట్టణానికి చెందిన షేక్ కరిముల్లా కుమారుడు షేక్ గౌస్ ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో రూ. 70 వేల సాయం అందింది. నరసరావుపేటకు చెందిన మా ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు స్వర్ణ నాగరాజుకి సమాచారం తెలియజేయడం, ఆయన సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పట్టణంలోని ప్రముఖులు, వ్యాపారస్తులు స్పందించారు. మొత్తం 70 వేల రూపాయలను సేకరించి అందించారు.