డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై తెలంగాణలో కేసు

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై తెలంగాణలో కేసు నమోదు అయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక సోనియా గాంధీ ఉన్నారని వ్యాఖ్యానించడంతో.. ఆయనపై టీ కాంగ్రెస్ నేతలు బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే నగేశ్ పోలీసులను కోరారు.