– ఎస్పీ సతీష్ కుమార్
పొన్నూరు, మహానాడు: పట్టణంలో బాపట్ల బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ వైన్స్ షాపులో చోరీకి గురైన నగదు దొరికిందని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు వైన్స్ షాపులో కార్మికుడిగా పనిచేసే సందీప్‌పై అనుమానం ఉండడంతో విచారించామని తెలిపారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. దుకాణంలోని వెనుక వైపు షట్టర్‌ను మాత్రమే మూసివేశారని, అయితే తాళం వేయలేదని అతను గమనించాడు. సెలవుల్లో నగదు దొంగతనం చేయాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. ఇటీవల ఒక తాళం సెట్‌ను దొంగిలించాడు, నగదు చెస్ట్‌తో సహా దుకాణం కీలు, కీల సెట్ పోయినట్టు అందరిని నమ్మించి వాటిని తన వద్ద ఉంచుకున్నాడు. ఈ నెల 11న సెలవులు రాకముందే నిందితులు సిబ్బందిని నమ్మించి సెలవు తీసుకుని 15,16 రాత్రి ప్లేవుడ్ బోర్డు తీసివేసి వెనుక వైపు షట్టర్ ద్వారా షాపులోకి ప్రవేశించి నగదు తీశాడని తెలిపారు. నగదు దొంగలించి వాటిని నెం.AP04AG3339 గల తన కారు డిక్కీలో దాచాడని ఎస్పీ తెలిపారు.