అమరావతి: జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేయా లని క్యాట్ ఆదేశించింది. జగన్ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడాన్ని వెంకటేశ్వరరావు క్యాట్‌లో సవాల్ చేశారు. గతంలో వాదనలు పూర్తికావడంతో తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర రావును మరోసారి సస్పెండ్ చేయడం న్యాయవిరుద్ధమని తీర్పు చెబుతూ సర్వీసులోకి తీసుకుని ఆయనకు ఇవ్వాల్సిన మొత్తం బకాయిలను ఇవ్వాలని ఆదేశించింది. సస్పెండ్ చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని పేర్కొంది.