ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగం
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) పై రాయ్‌పుర్ సీబీఐ కేసు నమోదు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో 2015 లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో కేసు ఫైల్ చేశారు. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) కు చెందిన 8 మంది అధికారులతో పాటు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యం లోని మెకాన్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరి పైన కేసు నమోదైంది..