తిరుపతి లడ్డు కలుషితంపై సీబీఐ విచారణ జరిపించాలి

– సీపీఐ నేతల డిమాండ్‌

గుంటూరు, మహానాడు: తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలపటంపై సీబీఐ విచారణ జరిపించాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు కోరారు. గుంటూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యావత్ భారత దేశంలో తిరుపతి వెంకన్న లడ్డు కలుషితంపై హిందూ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… వైసీపీ నేతలు చేసిన లడ్డు అక్రమ తయారీపై ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక కేసుగా తీసుకొని విచారణ జరిపించాలని కోరారు. కల్తీ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించిన అధికారులను తక్షణమే కఠిన శిక్షలు ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతోందని, ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రంలో 47 మంది మాత్రమే వున్నారు. 600 పైచిలుకు ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. గత టీడీపీ హయాంలో 78 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు నియమించాలని జీవో జారీ చేస్తే తదుపరి అధికారంలోకి వచ్చిన వైసీపీ పట్టిపట్టనట్టుగా ఊరుకోవడం గమనార్హం… టీటీడీ ఈవోగా శ్యామలరావు అధికారాలు చేపట్టిన తర్వాత లడ్డు తయారిపై నూతనంగా చర్యలు చేపట్టడం సూచించ దగ్గవిషయం… గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో ఉన్న ప్రైవేట్ హోటల్స్ పై నిఘా కొరవడటమే కారణంతో ఇష్టారాజ్యాంగా ప్రవర్తిస్తూ కల్తీ ఆహారం సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అన్నిరకాల దేవాలయాల్లో కలుషిత ఆహారపదార్ధాలు చేరకుండా ప్రసాదాల తయారీలో చూడాలని కోరారు. జాతీయ స్థాయిలో లాబోరేటరీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి అని నిర్ధారించారు. టీటీడీ మాజీ చైర్మన్ పై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్‌ మాట్లాడుతూ తిరుపతి లడ్డు విషయంలో గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో తప్పిదమా లేక ఈ ప్రభుత్వ అధికారుల తప్పిదమా అనేది నిగ్గుతేల్చి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.