-కేక్ కట్ చేసిన సిద్దార్థ్‌నాథ్ సింగ్
-పోలవరం వేగవంతం చేస్తామని వెల్లడి
విజయవాడ: కూటమి విజయంతో బీజేపీ కార్యాలయం ముందు నేతలు, కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాల్లో మునిగితేలారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్‌చార్జ్ సిదార్థ్‌నాథ్ సింగ్ 2024 విక్టరీ పేరుతో కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన సంకల్ప పత్రం, బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో అమలు చేస్తామన్నారు.
ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్ పాతూరి నాగభూషణం, ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ, బీజేపీ నేతలు కిలారు దిలీప్, వాసిరెడ్డి, సుబ్బయ్య, చైతన్య, మాదల రమేష్, పియూష్ తదితరులు పాల్గొన్నారు.