రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బలగాలు

అమరావతి:  కౌంటింగ్‌ నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఏపీకి కేటాయించిన 50 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ కేంద్ర బలగాలు సోమవారం విజయవాడ చేరుకున్నాయి. కౌంటింగ్‌ సందర్భంగా 5,600 మంది కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి సీఆర్‌పీఎఫ్‌ ఐజీ చారుసిన్హా పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కేంద్ర బలగాలు తరలివెళ్లాయి.