Mahanaadu-Logo-PNG-Large

స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఏర్పాట్లపై సీఈవో పరిశీలన

కౌంటింగ్‌కు సంబంధించి అధికారులకు సూచనలు
మీడియా సెంటర్‌, డెక్‌మెన్‌ హాలులో టీవీల తనిఖీ
కౌంటింగ్‌ రోజు డ్రై డేగా ప్రకటిస్తున్నట్లు వెల్లడి

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంట్‌ నియో జకవర్గంతో పాటు ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, జిల్లా ఎస్పీ తూషార్‌ డూండి సోమవారం సాయంత్రం పరిశీలించారు. తొలుత ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్‌ రూమ్‌తో పాటు, కౌంటింగ్‌ హాళ్లను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. అనంతరం మంగళగిరి, తెనాలి, పొన్నూరు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, తాడికొండ నియోజకవర్గాలకు సంబం ధించి కౌంటింగ్‌కు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ హాలు, మీడియా సెంటర్‌ను పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లను పోటీ చేసిన అభ్యర్థులు, వారి తరపున ప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిశీలించుకునేందుకు వీలుగా డెక్‌ మెన్‌ హాలులో ఏర్పాటు చేసిన టీవీలను పరిశీలించారు. ప్రత్యక్షంగా కూడా ఈవీ ఎంలు భద్రపర్చిన గదులను పరిశీలించుకోవచ్చని సూచించారు.

స్ట్రాంగ్‌ రూమ్‌లను మూడంచెల భద్రత
అనంతరం ఎన్నికల ప్రధానాధికారి మీడియాతో మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూమ్‌లను మూడంచెల భద్రతను ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలు కేటాయించటం జరిగిందని, రాష్ట్రంలో పికెట్లు ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో సున్నితమైన ప్రాంతాలను గుర్తించి, ఘర్షణలకు పాల్పడే అనుమానితులను గుర్తించి వారిపై అవసరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్‌ రోజు డ్రై డేను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 144 సెక్షన్‌ ఎంతవరకు అవసరమో అంతవరకు విధించటం జరుగు తుందని తెలిపారు. పల్నాడు జిల్లాలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని మీడి యా వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌, మంగళగిరి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జి.రాజకుమారి, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌, గుంటూరు తూర్పు నియోజకవర్గ రిట ర్నింగ్‌ అధికారి కీర్తి చేకూరి, తెనాలి సబ్‌ కలెక్టర్‌, తెనాలి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ప్రఖార్‌ జైన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ (ట్రైనీ) పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్‌, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి రాజ్యలక్ష్మి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, పొన్నూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి లక్ష్మీకుమారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, తాడికొండ నియోజకవర్గ రిటర్నిం గ్‌ అధికారి గంగరాజు, గుంటూరు రెవెన్యూ డివిజన్‌ అధికారి, ప్రత్తిపాడు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్రీకర్‌, గుంటూరు పార్లమెం ట్‌ నియోజకవర్గ సహాయక రిటర్నింగ్‌ అధికారి బీమారావు, డిప్యూటీ కలెక్టర్‌ (ట్రైనీ) స్వాతి తదితరులు పాల్గొన్నారు.