– కొరటాల శివ కు సుప్రీంలో కూడా చుక్కెదురు
– రచయిత శరత్ చంద్ర
2012 లో స్వాతి మాస పత్రిక లో ప్రచురిత న చచ్చేంత ప్రేమ నవల శ్రీమంతుడు సినిమా గా తీసారని ప్రముఖ రచయిత శరత్ చంద్ర కోర్ట్ కి ఎక్కారు.ఈ సినిమా కు తానే కథ రాసుకున్నట్టు కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై తన పేరు ప్రకటించు కొన్నారు. పైగా కథ కోసం కోటి రూపాయలు పారితోషకం తీసుకున్నట్టుగా కూడా శివ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ కి లిఖిత పూర్వకంగా తెలిపారు.
కాగా ఈ కేసులో శ్రీమంతుడు సినిమా దర్శకుడు కొరటాల శివ కి వ్యతిరేకం గా హైకోర్టు లో వాదనలు ప్రముఖ న్యాయ వాది చల్లా అజయ్ వినిపించడం జరిగింది. కొరటాల తరుపున నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. కాగా హైకోర్టులో కొరటాల శివ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించారు. ఈరోజు సుప్రీం కోర్ట్ కూడా ఆయన పిటిషన్ తిరస్కరించింది. దాంతో మళ్ళీ క్రిమినల్ కేసు ను కొరటాల శివ ఎదుర్కోక తప్పడం లేదు.గతం లో ఈ వివాదం లో హైదరాబాద్ క్రిమినల్ కోర్ట్, సిటీ సివిల్ కోర్ట్ లో కేసు నడుస్తుంది.
కేసు పూర్వ పరాలు ఇవి :
క్రిమినల్ పిటిషన్ 1729 of 2017 క్రింద ముందు క్రిమినల్ కేసు. సిటీ క్రిమినల్ కోర్ట్ నాంపల్లి లో కేసు నమోదు అయ్యింది.ఎంబీ క్రియేషన్ అధినేత మహేష్ బాబు, మైత్రి మూవీస్ అధినేత ఎర్నేని నవీన్ లపై కేసు నమోదు చేయగా వారు కూడా స్క్వాష్ కోసం కోసం హైకోర్టును ఆశ్రయించారు వారిని కేసు నుండి మినహాయిస్తూ, కొరటాల శివని కేసును ఎదుర్కోమని హైకోర్టు ఆదేశించింది.