నరసరావుపేట, మహానాడు: నరసరావుపేటలో ఎన్జీవో హోమ్‌లో ఎన్నికల కేంద్రాన్ని సోమవారం నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పరిశీలించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ విజ్ఞతతో ఓటువేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే ప్రజలందరూ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.