చక్ దే ఆంధ్రా బచ్చీ

-హాకీ టోర్నీలో దుమ్మురేపిన ఆంధ్ర బాలికలు
-11 – 0 గోల్స్ తేడాతో కేరళ పై ఘన విజయం
-బెస్ట్ ప్లేయర్ శ్రీవిద్య
(జానకీదేవి, తుని)

వైఎస్ ఆర్ కడప జిల్లా పులివెందులలో జరుగుతున్న జూనియర్ బాలురు , బాలికల సౌత్ జోన్ నేషనల్ ఛాంపియన్ షిప్ 24 హాకీ టోర్నీలో ఆంధ్ర బాలికల జట్టు దుమ్మురేపింది. అపత్రిహాత గోల్స్ తో కేరళ జట్టును మట్టి కరిపించింది.

పులివెందులలో శనివారం ఆంధ్రప్రదేశ్, కేరళ బాలికల జట్లు తలపడగా ఆంధ్రప్రదేశ్ బాలికలు కేరళ జట్టుపై 11 ‌‌- 0 గోల్స్ తేడాతో ఘనవిజయాన్ని సాధించారు. కేరళ జుట్టు సున్నా గోల్స్ తో వెను తిరిగారు. అనంతరం రెండో మ్యాచ్ బాలుర మ్యాచ్ కర్ణాటక, తెలంగాణ జట్లు తలపడ్డాయి.

ఆంధ్రప్రదేశ్, కేరళ మధ్య జరిగిన హోరా హోరి మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ విజయానికి అత్యధిక గోల్స్ సాధించిన శ్రీ విద్య బెస్ట్ ప్లేయర్ నిలిచింది. కడప జిల్లా ఉమెన్ హాకీ మాజీ సెక్రటరీ, నేషనల్ హాకీ ఎంపైర్ బి సుధాకర్, జిల్లా సెక్రటరీ శేఖర్ ల చేతుల మీదుగా బెస్ట్ ప్లేయర్ మెమెంటోను శ్రీ విద్య అందుకుంది.

ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ 60 ఏళ్లుగా పులివెందులలో హాకీ అంటే ఒక స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఈనాడు నేషనల్ లెవెల్లో ఆంధ్ర జుట్టు దూసుకు వెళ్లటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ హాకీ క్రీడను ముందుకు తీసుకు వెళ్లేందుకు నాయకుల సహకారం ఎంతో ఉందన్నారు.