పోరాట స్ఫూర్తిని చాటిన చాకలి ఐలమ్మ

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక, వీర వనిత చాకలి ఐలమ్మ అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో మంగళవారం చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి అని గళ్ళా మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ మల్లేశ్వరావు, కిరణ్, పూర్ణ, లక్ష్మయ్య, మల్లె ఈశ్వరావు, వేములకొండ శ్రీనివాస్, చంద్రగిరిబాబు, అంజయ్య, మురళి, కరీమున్, వీరయ్య, నాగరాజు, దళవాయి కిషోర్, మొవ్వ వేణు, గుర్రం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.