ఈరోజు పుంగనూరు పట్టణం నందు మదనపల్లి రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ ను పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభించారు . ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి టిఫిన్ చేశారు.
ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున అన్న క్యాంటీన్ లను ప్రారంభించి పేదల ఆకలని తీర్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంటీన్లు అన్నిటిని ధ్వంసం చేసి పేదల పొట్ట కొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అదేవిధంగా నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ఆశయాలు నిరూపించుకోవాలి అని ఒక సంకల్పంతో ఎన్నికలకు ముందు పేద ప్రజల కోసం తిరిగి అన్న క్యాంటీన్ లను ప్రారంభిస్తామని వాగ్దానం చేసి ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే అన్న క్యాంటీన్లను ప్రారంభించి పేదల ఆకలి తీర్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.