Mahanaadu-Logo-PNG-Large

సంపద సృష్టికర్తకు సవాళ్ళేమీ కొత్త కాదు

-అవ్వాతాతల కళ్ళల్లో ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– ఊరూరా పండుగలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అమలు

-దర్శిలో పింఛన్ల పంపిణీలో మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి 

మొదటిసారి దర్శి నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రివర్యులు స్వామికి శాలువాతో సత్కారించి, పుష్ప గుచం అందజేసి సాదర స్వాగతం పలికిన డా. గొట్టపాటి లక్ష్మీ లలిత్ సాగర్ దంపతులు.

దర్శి(రాజంపల్లి):
అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం వెల్లివిరియాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పథకాన్ని ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, రాజంపల్లిలో మంత్రి చేతులమీదుగా ప్రారంభించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేత, దర్శి టీడీపీ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అధ్యక్షతన పింఛన్ల పంపిణీని లాంఛనంగా ఆరంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు అవ్వాతాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పింఛను మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచి ఏప్రిల్, మే, జూన్ మెలకి సంబంధించిన బకాయిలు మొత్తం రూ. 7 వేలు పంపిణీ చేస్తున్నామని వివరించారు.

గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో సొసైటీలోని అన్ని విభాగాల సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పింఛను మొత్తాన్ని పెంపొందించడం అనేది సమాజంలోని పేద మరియు బలహీన వర్గాల కష్టాలను, ముఖ్యంగా వృద్ధులు మరియు వితంతువులు మరియు వైకల్యం ఉన్నవారు మొదలైన వారి కష్టాలను తీర్చడానికి, గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు ఒక ప్రధాన సంక్షేమ చర్యగా చెప్పుకోవాలి. ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు, ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ, వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులకు సామాజిక భద్రత పెన్షన్ల మొత్తాన్ని పెంచుతూ GOMs.నం.43 ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ART (PLHIV) వ్యక్తులు , సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, లింగమార్పిడి మరియు డప్పు కళాకారులు నెలకు రూ. 4000/-, వికలాంగులు మరియు బహుళ వైకల్య కుష్టువ్యాధి వ్యక్తులు నెలకు రూ. 6000/-, పూర్తిగా వికలాంగులు నెలకు రూ. 10,000/- ,దీర్ఘకాలిక వ్యాధులు అనగా ద్వైపాక్షిక ఎలిఫాంటియాసిస్-గ్రేడ్ 4, కిడ్ని డయాలసిస్ చేయించుకుంటున్న క్రానిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు నెలకు రూ.10,000/- అందజేస్తున్నాం.

సంపదసృష్టికర్తకు సవాళ్ళేమీ కొత్తకాదు:
దేశ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా ఈరోజు స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల చెంతకే వెళ్ళి పింఛన్ పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంలో ఒక వైద్యురాలిగా, మీ మనువరాలిగా మీ చేతుల్లోకి పింఛను సొమ్మును అందిస్తూ.. మీ కళ్లల్లో ఆనందం చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే నేత. రాష్ట్రం ఆర్థికభారం నేపథ్యంలో ఎదురయ్యే సమస్యల సవాళ్ళను ఆయన అవలీలగా అధిగమించగలరు. సంపద సృష్టి కర్తగా పేరున్న చంద్రన్నకు ఈ సవాళ్ళేమీ పెద్ద లెక్క కానేకాదు.

నియోజకవర్గంలో 30, 676 మందికి:
మన నియోజకవర్గం పరిధిలో దొనకొండ, కురిచేడు, దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరుతో కలిపి 5 మండలాల్లో మొత్తం 30, 676 మంది లబ్ధిదారులకు రూ. 20, 07,48000లు నగదును ఇవాల్టి సాయంత్రంలోగా పంపిణీ చేస్తున్నాము. ఇంతటి మహత్కార్యంలో పాల్గొన్న ఎన్టీఆర్‌ భరోసా పింఛను లబ్ధిదారులకు, దర్శి నియోజకవర్గం టీడీపీ నేతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో దర్శి నియోజకవర్గ ప్రజలకు నేనెప్పుడూ ఎల్లవేళలా సేవ చేయడానికి అండగా ఉంటానని తెలియజేస్తున్నాను.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని అధికారులు, మాజీ శాసన సభ్యులు , సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతి ఛైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ కేడర్ పాల్గొన్నారు.