– అండర్ 19 ఎంపికలో అవకతవకలు
హెచ్ సి ఏ ప్రక్షాళన అవసరం
– భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. హెచ్ సిఏ అండర్ 19 ఎంపికల్లో అవకతవకలు జరిగాయంటూ మండిపడ్డ ఆయన హెచ్ సి ఏ కమిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కమిటీ వైఖరి వల్ల నష్టపోయిన క్రీడాకారుల బంధువులు విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకువెళ్ళడంతో బాధితులకు మద్దతుగా ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోకి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే…
హెచ్ సి ఎ అండర్19 క్రికెట్ లో అసలైన క్రీడాకారులకు ప్రాధాన్యత లేకుండా సెలెక్షన్స్ జరిగాయి. బాధితులు తమ దృష్టికి తీసుకొచ్చారు… మంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అనైతిక కారణాలను చూపి సెలక్షన్స్ నుండి తొలిగించారు… ఈ రోజు హెచ్ సి ఎ కార్యదర్శి దేవ్ రాజ్ ని కలిశాం… కానీ హెచ్ సిఎ లో కీలక పాత్ర వ్యవహరించాల్సిన కార్యదర్శికి బదులుగా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారు.. గత రెండేళ్ళ నుంచి జరిగే టోర్నీలోని క్రీడాకారుల డేటా, వారి ప్రతిభ అడిగాం.. హెచ్ సిఎ ని ప్రక్షాళన చేయాని, ఇక్కడ జరుగుతున్న విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడుతున్నారు. క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగట్లేదు.. హెచ్ సి ఏ కమిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.