చందమామ దూరమై పోతున్నాడు

‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అంటూ మనం పాటలు కూర్చిన చందమామ భూమికి దూరంగా జరిగిపోతోందట.

విస్కసిన్-మ్యా డిసన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఏటా 3.8cm చొప్పున చంద్రుడు దూరమవుతుండటం భూభ్రమణం మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.

200 మిలియన్ సంవత్సరాల తర్వాత భూ భ్రమణానికి 25 గంటలు పడుతుందని పేర్కొన్నారు. కాగా, 1.4 బిలియన్ ఏళ్ల క్రితం ఓ రోజు 18 గంటల్లో పూర్తయ్యేదని పరిశోధనలో తేలింది.