Mahanaadu-Logo-PNG-Large

మొదట రైతు బజార్లు పెట్టింది చంద్రబాబే

తక్కువ ధరలకే నిత్యవసర సరుకులు

పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు కళ్లెం వేసి, పేద మధ్యతరగతి వారికి నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులోకి తీసుకురావడానికి క్రొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే కృష్ణ జిల్లాల్లోని 9 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసి స్టీమ్ రైస్ (బి.పి.టి/సోనా మసూరి రకం) కేజీ రూ. 48/- కు, RAW రైస్ (బి.పి.టి/సోనా మసూరి రకం) రూ. 47/- కు మరియు దేశవాళీ కందిపప్పు ధర కేజీ ఒక్కింటికి రూ.150/- కు విక్రయాలు జరుపుతోంది. ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక రైతు బజార్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో తక్కువ ధరలకు కందిపప్పు, రైస్ కొనుగోలు చేసిన వినియోగదారులు తమ అభిప్రాయాలు ఇలా తెలియజేశారు.

మచిలీపట్నం ఈడేపల్లి పోస్టల్ కాలనీకి చెందిన కాగిత రేఖ మాట్లాడుతూ.. కూరగాయలు కొనడానికి రైతు బజార్ కి వచ్చాను. ఇక్కడ చూస్తే కందిపప్పు 150 రూపాయలకే గవర్నమెంట్ ఇస్తోంది. అంతకుముందు 210, 225 రూపాయల వరకు బహిరంగ మార్కెట్లో ఉంది, కందిపప్పు బయట కొనాలన్న ఇబ్బందులు పడేవాళ్ళం, ఇక్కడ 150 రూపాయలకే వచ్చింది. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇది చూసి డిమార్ట్, విశాల్ మార్ట్ వాళ్లు కూడా ధరలు తగ్గించారు. రైతు బజారు పెట్టిందే చంద్రబాబు నాయుడు , రైతు బజార్లో కూరగాయల ధరలు మధ్యతరగతి వారు కొనేలానే ఉన్నాయి. కందిపప్పు అందరూ తీసుకోండి.

మచిలీపట్నం పాత రామన్నపేటకు చెందిన దూదే దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… మార్కెట్లో 180 రూపాయల ధర ఉన్న కందిపప్పు ఇక్కడ 150 రూపాయలకే వస్తోంది. కేజీకి 30 రూపాయలు తగ్గుతుంది. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి నిత్యవసర వస్తువుల ధరలు అందుబాటులోకి తేవడం చాలా బాగుంది. ముందు ముందు పేదలకు మరిన్ని పథకాలు తీసుకురావాలి. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చేయాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ పేదల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలి.

అంతకుముందు డీఎస్ఓ వి. పార్వతి స్థానిక రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ తనిఖీ చేశారు. ప్రభుత్వం తక్కువ ధరకు అందిస్తున్న కందిపప్పు, రా రైస్ , స్టీమ్ రైస్ విక్రయాలు, విక్రయిస్తున్న సరుకుల నాణ్యత పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని సూచించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.