అమరావతి, మహానాడు: నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నేతలపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇప్పటికీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చినా కొంతమంది స్పందించకపోవడంపై ఆయన అసహనం వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… నిర్లక్ష్యం వీడి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రజల, కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను తన నివాసంలోనే ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నాను. అనేకమంది కార్యకర్తలు మాపై కేసులు ఉన్నాయంటూ ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ కార్యకర్తల చిన్న చిన్న సమస్యలు కూడా తెలుసుకోపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొంటున్న ఐ టి డి పి, సోషల్ మీడియా వాళ్ళ వద్ద వివరాలు ఉంటాయి వారి వద్ద నుంచి అనేక సమస్యలను సేకరించండి. మనం చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సోషల్ మీడియా, ఐటిడిపి, వాళ్ల సహకారంతో ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో గుర్తింపు వచ్చే విధంగా చేసుకోవాలని సూచించారు.