వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేకును కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, నిశ్శంకర శ్రీనివాసరావు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.