Mahanaadu-Logo-PNG-Large

రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు

– అందుకే ఓట్‌ ఆన్‌ అకౌంట్
– బాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో రూ.7 వేల కోట్లు ఉన్నాయి
– ఆంధ్రప్రదేశ్‌ అంటే అరాచకం. ఆటవికం. రెడ్‌బుక్‌ పాలన
– క్యాంప్‌ ఆఫీస్‌లో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తన పాలనలో జరిగిన అక్రమాలకు సంబంధించి.. విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై జగన్ స్పందించారు. ఆ మేరకు తన వద్ద ఉన్న ఆధారాలు మీడియాకు వెల్లడించారు.

జగన్ ఇంకా ఏమన్నారంటే.. పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే ధైర్యం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి 52 రోజులు. ఇన్ని రోజులు రాష్గ్రం ఏ దిశలో పయనిస్తోంది. రాష్ట్రం పూర్తిగా రివర్స్‌లో వెళ్తోంది. ప్రశ్నించే హక్కు లేదు. ఎక్కడికక్కడ అణిచివేత. ఇది చాలా బాధాకరం. ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పడితే, 12 నెలలకు బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది.

కానీ, ఈ ప్రభుత్వం, 7 నెలల కోసం కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం లేదు. రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు. అందుకే ఓట్‌ ఆన్‌ అకౌంట్.

రాష్ట్రంలో ప్రజలు బయటకు రాకుండా, ప్రశ్నించకుండా, హత్యా రాజకీయాలు చేస్తున్నాడు. అలా వారిని భయపెడుతున్నాడు. అలాంటి భయానక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. చంద్రబాబుకు ఒక మోడ్‌ ఆఫ్‌ ఆపరెండిస్‌ ఉంటుంది. అది ఒక వంచన. దగా, మోసం. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. కాబట్టి చంద్రబాబు చేస్తోంది మంచి అనిపిస్తారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. అంత అరాచకం ఉంది. దానికి కారణం మా ప్రభుత్వం అని నిందిస్తున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయాయని ప్రచారం.గత ఎన్నికల ముందు ఏమని ప్రచారం చేశారు? రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లు అని విపరీతంగా దుష్ప్రచారం చేశారు. రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లు లేకున్నా.. అలా చూపాలని చాలా ప్రయత్నం చేశారు. అది సాధ్యం కావడంతో.. రూ.10 లక్షల కోట్లు అప్పు అన్నారు. దాన్నే గవర్నర్‌గారి ప్రసంగంలో చెప్పించారు.

నిజానికి ప్రభుత్వ అప్పులు ఎన్ని అని చూస్తే..ఈ ఏడాది జూన్‌ వరకు ప్రభుత్వ అప్పు చూస్తే.. అవి 5,18,708 కోట్లు. బాబు అధికారం దిగిపోయే నాటికి ఉన్న అప్పు 2,71,798 కోట్లు. అదే రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు రూ.1,18,051 కోట్లు. ఇంకా గవర్నమెంట్‌ గ్యారెంటీల అప్పులు కూడా చూస్తే..చంద్రబాబు దిగే నాటికి చూస్తే.. రూ.50 వేల కోట్లు. అవి మా ప్రభుత్వం దిగి పోయే నాటికి ఆ అప్పు రూ.1,06,000 కోట్లు మాత్రమే.

ఇంకా స్టేట్‌ లయబిలిటీ అప్పులన్నీ కూడా కలిపి చూస్తే..బాబు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం అప్పు రూ.1,53,347 కోట్లు ఉండగా, ఆయన దిగిపోయే నాటికి అవి రూ.4,08,710 కోట్లకు చేరాయి. ఇది 21.63 శాతం పెరుగుదల. అదే మన ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ,7,48,000 కోట్లు అప్పు ఉంది. ఇది 12.90 శాతం మాత్రమే పెరుగుదల.మరి, ఆయన హయాంలో అప్పులు ఎక్కువయ్యాయా? లేక మా హయాంలోనా? దీన్ని అందరూ గుర్తించాలి.రాష్ట్ర అప్పులపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన కేంద్రం.. ఆ మొత్తం రూ.4,85,491 కోట్లు మాత్రమే.

2019లో మేము అధికారం చేపట్టేనాటికి ఖజానాలో ఉన్న మొత్తం కేవలం రూ.100 కోట్లు మాత్రమే. అయినా, అప్పుడు మేము, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రకటించాము. పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాం. కానీ, ఇలా చంద్రబాబు మాదిరిగా 7 నెలల కోసం ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌కు వెళ్లలేదు. అలా ఈ 5 ఏళ్లలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా వేశాం.

రూ.5,655 కోట్లు కేంద్రం నుంచి జూన్‌ 10న వచ్చాయి. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో.. అంటే జూన్‌ 12 నాటికి రాష్ట్ర ఖజానాలో దాదాపు రూ.7 వేల కోట్లు ఉన్నాయి. అయినా చంద్రబాబు డ్రామాలు ఆడుతూ, ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌ ప్రవేశపెడుతున్నాడు. అలా పథకాల అమలు నుంచి తప్పుకుంటున్నారు.

రషీద్‌ దారుణ హత్యను ఖండిస్తూ.. నేను వినుకొండ వెళ్తుంటే.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం, మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే.. అది కుట్ర అంటూ దుష్ప్రచారం చేశారు. ఆర్డీఓ ఆఫీస్‌లో ఒకవేళ డాక్యుమెంటు కాలిపోతే, అవే రికార్డులు ఎమ్మార్వో ఆఫీస్‌లో ఉంటాయి. కలెక్టర్‌ ఆఫీస్‌లో ఉంటాయి. చివరకు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.

సీఎం కొడుకు. మంత్రి అయిన నారా లోకేష్‌ ఏకంగా ఇలా రెడ్‌బుక్‌ ప్రదర్శిస్తూ.. బెదిరింపులు. రాష్ట్రమంతా హోర్డింగ్‌లు. ఎంత దారుణం. అలా ఏం సందేశం ఇవ్వదల్చారు?. ఆంధ్రప్రదేశ్‌ నిర్వచనం మారింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ అంటే అరాచకం. ఆటవికం. రెడ్‌బుక్‌ పాలన.

అమ్మ ఒడి (తల్లికి వందనం) కోసం 43 లక్షల తల్లులు, 82 లక్షల పిల్లలు ఎదురుచూస్తున్నారు. రైతులకు ఉచిత పంటల బీమా అమలు కావడం లేదు. మీరు బీమా సొమ్ము కడితే, వారికి పరిహారం అంది ఉండేది. కానీ మీరు పట్టించుకోవడం లేదు. మేము గతంలో ప్రతి ఎకరాకు ఇన్సూర్‌ చేశాం. జియో ట్యాగింగ్‌ చేశాం. ఆర్బీకేల ద్వారా అన్నీ అందాయి.

సూపర్‌ సిక్స్‌ ఏమైంది? అందులో ప్రకటించిన పథకాలు ఏమయ్యాయి? తల్లికి వందనం లేదు? మూడు ఉచిత సిలిండర్లు లేవు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఏమయ్యాయి? ఆ వివరాలు ఉన్నాయి కదా? ఓటర్ల జాబితాలో 18 ఏళ్లు నిండిన వారే ఉంటారు? ఆ జాబితా చాలు కదా?