అంబేద్కర్ స్మృతి వనానికి చంద్రబాబు 12 ఎకరాలు ఇచ్చారు

– పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు

గుంటూరు, మహానాడు: అమరావతి రాజధాని లో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటుకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు 12 ఎకరాలు ఇచ్చారని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం విలేఖర్లతో మాట్లాడారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. వైసీపీ ప్రభుత్వం 175 కోట్ల రూపాయలతో విజయవాడలో ఏర్పాటు చేస్తా అన్నారు.. కానీ 400 కోట్లతో బడ్జెట్ పెంచి అంబేద్కర్ పేరు తో అవినీతి చేశారు. అంబేద్కర్ పెరు కన్నా జగన్ పెరు ఉండడం దళితులకు నచ్చలేదు. 27 పథకాలు 42 వేల కోట్లు నిధులు మళ్లించినప్పుడు దళిత సంఘాలు ఏమయ్యారు? 188 మంది దళితులను వైసీపీ ప్రభుత్వం లో చంపేస్తే ఏం చేశారు? వైసీపీ పాలనలో ఇసుక ధరలు పెంచితే ఆడిగినందుకు అతనిని చంపేశారు? దళితుల మీద ఎస్సి ఎస్టీ కేసులు పెట్టింది ఎవరు?