నిర్మాణ రంగానికి ఊపిరులూదారు చంద్రబాబు

* ఉచిత ఇసుకతో లక్షల మంది కార్మికులకు మేలు
* వైసీపీ చేయలేని పనిని చంద్రబాబు చేశారని కడుపుమంట
* ఉచిత ఇసుక పంపిణీపై నీలిమిడియా దుష్ప్రచారం
* వైసీపీ అధికారంలో భకాసురులుగా ఇసుకను బొక్కారు
* వైసీపీ అబద్ధాలను నిజాలు చేయాలని చూస్తోంది
* వైసీపీ ఖచ్చితంగా గత చరిత్రగా మిగిలిపోతుంది

మంగళగిరి, మహానాడు: ఉచిత ఇసుకతో లక్షల మంది కార్మికులకు మేలు చేకూర్చి, నిర్మాణ రంగానికి చంద్రబాబు ఊపిరులూదారు. అబద్ధాలు అసత్యాన్ని నమ్ముకున్న వైసీపీ ఖచ్చితంగా గత చరిత్రగా మిగిలిపోతుందని… రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ చేయలేని పనిని చంద్రబాబు చేశారన్న కడుపుమంటతో నీలి మీడియాతో విష ప్రచారం చేయిస్తూ.. ఉచిత ఇసుక పంపిణీపై తప్పుడు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ..

కుదేలైన నిర్మాణ రంగానికి పునర్జీవం కల్పించాడానికి… లక్షలమంది కార్మికులు ఉపాధిని తిరిగి పొందేందుకు చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీని తీసుకు వచ్చారు. ప్రభుత్వం గుర్తించిన స్టాక్ యార్డ్ లలో ఉన్న ఇసుకను ఉచితంగా తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైసీపీ చేయలేని పనిని చంద్రబాబు చేశారన్న అసూయ వైసీపీ నేతల్లో నిండింది. ఉచిత ఇసుకపై నీలిమిడియాతో వైసీపీ దుష్ప్రాచారం చేస్తోంది. గడిచిన ఐదేళ్లలో వైసీపీ నేతలు సహజవనరులను దోచుకున్నారు. అధికారికంగా రూ.475 పెట్టి ప్రభుత్వానికి రూ. 375 వసూలు చేశారు. అనధికారికంగా అంతకు రెండింతల ధరలకు విక్రయించి దండుకున్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఉచితంగా ఇసుక అందుబాటులో ఉంది. లోడింగ్, రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఇసుకను అందిస్తుంటే వైసీపీ నేతలకు కడుపుమంట ఎందుకు ?

లక్షల మందికి మేలు జరుగుతుంటే వైసీపీ నేతలకు ఎందుకు అసూయ? ఎందుకు విషం కక్కుతున్నారు? కొడాలి నాని వెళ్లి పరిశీలించాడు.. అంతా సక్రమంగానే ఉందని మౌనంగా వచ్చాడు. ఉచిత ఇసుకతో దాదాపు 125 విభాగాల వారు బతికేందుకు చంద్రబాబు అవకాశం కల్పిస్తే వైసీపీ, నీలిమీడియా విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి నెలలోనే ఒక్కోక్క హామీని అమలు చేస్తూ.. ప్రజల్లోకి వెళ్తుంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ నేతల స్వార్థం, ధనదాహానికి నిర్మాణరంగం కుదేలైంది. వ్యవసాయం తరువాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే నిర్మాణరంగాన్ని ఇబ్బందులు పాలు చేశారు. 50 లక్షల మంది భవనిర్మాణ కార్మికులు విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా చేశారు. కొత్త ఇసుక పాలసీతో భవనిర్మాణ కార్మికులను రోడ్డు పాలు చేశారు.

కరోనా సమయంలో కూడా కనికరం లేకుండా నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసింది. టీడీపీ ప్రజల ప్రభుత్వం ప్రజలకోసం పనిచేస్తోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే జగన్ రెడ్డిని ఎంత కసితో ప్రజలు ఓడించారో ఆ పార్టీ నేతలకు అర్థం కావడంలేదా? జగన్ రెడ్డి దుష్ప్రరిపాలన వలన, దుర్నీతి వలన, స్వార్థం వలన, నియంతృత్వ పోకడతో వ్యవస్థలను భ్రష్టు పట్టించి రాజ్యంగ ధర్మాలను విస్మరించి వైసీపీ నేతలు సాగించిన రాక్షస పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారారు. వైసీపీని రాష్ట్రం నుండి తరమికొట్టడానికి తిరుగులేని తీర్పు ఇచ్చినా వైసీపీ నేతలకు సిగ్గు, బుద్ధి రావడంలేదు. నీలిబుద్ధి, లేహ్యబుధి, వక్రబుధి ఇంకా మారకుంటే వైసీపీ నేతలను ఆ దేవుడు కూడా బాగుచేయలేడు. ఉచిత ఇసుక విధానం ఒక పవిత్రకార్యక్రమం, లక్షల మందికి మేలు చేసే కార్యక్రమంపై విష ప్రచారం చేస్తారా? మీకు అసలు బుద్ధి ఉందా? ఇకనైనా మారండి ప్రజల తరుఫున మాట్లాడటం నేర్చుకోండి.

సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ఉందని… నీలి మీడియా పత్రిక ఉందని ఒక అసత్యాన్ని పదే పదే ప్రజలకు తెలియచెప్పడం ద్వారా దాన్ని నిజం చేద్దామనుకునే భ్రమలో ఉన్నారు. మీ అబద్దాలను ప్రజలు తిప్పి కొట్టి చంద్రబాబుకు పట్టం కట్టారు అయినా మారలేదు. నిజాలను మరుగు పరచాలనో, సత్యాన్ని సమాధి చేయాలని ప్రయత్నం చేస్తే ఆ సత్యమే మిమల్ని, మీ పార్టీని దహిస్తుంది. ఖచ్చితంగా వైసీపీ అనేది గత చరిత్రగా మిగిలిపోతుంది. వైసీపీ భవిష్యత్ లేని పార్టీ.. ఆపార్టీ కార్యక్రమాలు ఇక ఉండవు. వైసీపీ నేతలు ఇకనైనా నిజాలు మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రభుత్వంపై విషం చిమ్మడం మానుకోవాలి. చంద్రబాబు బలమైన నాయకత్వం ఏపీకి అవసరమని నమ్మి ప్రజలందరు ఏకపక్షంతో తీర్పు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సహకారం, బీజేపీ బలంతో ఎన్డీఏ కూటమికి అఖండ మెజార్టీ వచ్చింది. ప్రజలందరి మేలుకోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికోసం కూటమి ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకోంటుంది. భవిష్యత్ లో మరన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుదిటి రాతను మార్చే శక్తి, యుక్తి చంద్రబాబుకు ఉంది. ప్రజానీకం కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ స్వాగతించి బలపర్చాలని ప్రజలను కోరారు.