– జగన్ రెడ్డికి కుటుంబ విలువలు.. కుటుంసభ్యులపై ప్రేమాభిమానాలు ఉంటాయా?
– చంద్రబాబు దళిత డిక్లరేషన్ కూడా ప్రకటించబోతున్నారు
– ఎన్నికల ముందు జగన్ రెడ్డి చెప్పే మాటలన్నీ ఎన్నికల స్టంట్
– ఎన్నికల్లో పోటీకి వైసీపీ అభ్యర్థుల్ని వెతుక్కునే దుస్థితికి దిగజారిన జగన్ ను ప్రజలు నమ్ముతారా?
• నోటిఫికేషన్ వచ్చేముందు జగన్ చేసే ప్రసంగాలు… చేపడుతున్న కార్యక్రమాలపై ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టాలి
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
ఓటమి భయంతోనే జగన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిననే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నాడని, ఆయనపై వైసీపీనేతలే నమ్మకం ఉంచడం లేదని, మా నమ్మకం నువ్వే జగన్ అనే బోర్డులకు బదులు మా నీపై నమ్మకం లేదు జగన్ అని పెడితే బాగుంటుందని, నియోజకవర్గాల్లో తనపార్టీ తరుపున పోటీకి అభ్యర్థుల్ని వెతుక్కునే దుస్థితికి జగన్ దిగజారాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… నోటిఫికేషన్ వచ్చే ముందు ముఖ్యమంత్రి హోదాలోజగన్ రెడ్డి చేసే పనులు.. చేపట్టే కార్యక్రమాలపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలి
“ ఎన్నికలకు 6 నెలల ముందు ఏ నాయకుడు,ప్రభుత్వం చేసే పనులైనా కేవలం ఎన్నికల్ స్టంట్ లో భాగమేనని గతంలో చెప్పిన జగన్ రెడ్డి, నేడు ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఎలాంటి చర్యో చెప్పాలి. సెంటు పట్టాల పేరుతో ముఖ్యమంత్రి ఆడుతున్న డ్రామాలకు తగినట్టే, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అధికారుల సంతకా లు, స్టాంపుల ముద్రలు లేకుండా ఉత్తుత్తి ఇళ్ల పట్టాలు పేదలకు పంచుతున్నారు. మరో వారం 10రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి చేసేపనులు…చేపట్టే కార్యక్ర మాలపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలి.
డీబీటీ ద్వారా పేదలకు రూ.2.50లక్షలకోట్లు ఇచ్చానంటున్న జగన్ రెడ్డి, తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రూ.10లక్షలకోట్లు అప్పులు చేసిన జగన్ రెడ్డి, డీబీటీద్వారా పేదలకు రూ.2.50 లక్షలు ఇచ్చానని చెబుతూ, తానుచేసిన అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తు న్నాడు. డీబీటీ విధానం గతంలో చంద్రబాబే అమలుచేశాడు. డైరెక్ట్ గా లభ్దిదారు లకు అందాల్సిన ప్రభుత్వసాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో పడేలాచేశారు. మద్యం అమ్మకాల్లో నగదు చెల్లింపులు మాత్రమే అనుమతించిన జగన్ రెడ్డి, అలా వచ్చేసొమ్ముని వచ్చే ఎన్నికల్లో పంచి గెలవాలని చూస్తున్నాడు. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు దళిత డిక్లరేషన్ కూడా ప్రకటించ బోతున్నారు. జగన్ రెడ్డి చేసిన మోసాలు.. దోపిడీ..అవినీతిని ప్రజలకు తెలియ చేసి, ఎన్నికలనాటికి ప్రజలు ఈ ముఖ్యమంత్రిని ఛీకొట్టేలా చేస్తాం.
సొంత చెల్లిని తనపార్టీ పేటీఎం బ్యాచ్ తో జగన్ అనరాని మాటలు అనిపిస్తున్నాడు సొంత బాబాయ్ ను కిరాతకంగా చంపించిన జగన్ రెడ్డికి కుటుంబ విలువలు.. కుటుంసభ్యులపై ప్రేమాభిమానాలు ఉంటాయా? సొంతచెల్లి అని చూడకుండా వేరేపార్టీలో చేరి, తనను ప్రశ్నిస్తోందన్న అక్కసుతో షర్మిలను వైసీపీ సోషల్ మీడియాద్వారా పేటీఎం బ్యాచ్ తో అనరాని మాటలు అనిపిస్తున్నాడు. జగన్ రెడ్డి నైజం గ్రహించిన ప్రజలు అతనికి సరైన విధంగా బుద్దిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలంలో టీడీపీ-జనసేన నిర్వహించే సభలు, చేపట్టబోయే కార్యక్రమాలు జగన్ రెడ్డిని వణికిస్తాయి. ఆక్రమంలో భాగంగా 28వతేదీన ఇరుపార్టీలు సంయుక్తంగా నిర్వహించ బోతున్న భారీ బహిరంగసభ జగన్ రెడ్డికి దడపుట్టిస్తుంది.