తెలుగువారికే ఆయన గర్వకారణం
రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే సీఎంగా చేసుకోవాలి
పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్
నరసరావుపేట, మహానాడు : పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో శనివారం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు పాల్గొన్నారు. కొమ్మాలపాటి మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తి చంద్రబాబు అని, ఆయన తెలుగుగడ్డ మీద పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా ఏ విధంగా అరాచకాలు చేసిందో మనం చూశాం..రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది…అందుకు చంద్రబాబును తిరిగి గెలిపించుకోవాలని పిలుపుని చ్చారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచి తీరుతామని స్పష్టం చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు.