– జన చైతన్య వేదిక
ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ స్వీకారం చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రజలకు తోడ్పడే ఐదు పథకాల ఫైల్స్ పై సంతకాలు చేయడం పట్ల జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి హర్షం ప్రకటించారు. మెగా డీఎస్సీ తో దాదాపు 16,350 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం, రైతులకు నష్టం కలిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం, వృద్ధులకు పెన్షన్ ను నాలుగు వేలకు పెంచడం, అన్న క్యాంటీన్ లను పునరుద్ధరించడం, స్కిల్ సెన్సస్ ద్వారా నైపుణ్యాలను పెంపొందించడం లాంటి పథకాలు కోట్లాది ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందిస్తాయని తెలిపారు.
చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని, అవినీతిని ప్రోత్సహించిన ఐఏయస్, ఐపియస్, ఐఫ్ఎస్ అధికారులను, జిల్లా, మండల అధికారులపై చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్ లో ఏ అధికారి అయినా ఇలాంటి తప్పులు చేయడానికి భయపడే విధంగా చర్యలు ఉండాలన్నారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులను ప్రోత్సహించాలని, గౌరవించాలని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.