హైదరాబాద్, మహానాడు: విదేశీ పర్యటన ముగించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్, పలువురు నాయకులు స్వాగతం పలికారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు.