ప్రతి విద్యార్థికి అండగా,తోడుగా చంద్రబాబు

-మెరుగైన విద్యకు తొలి ప్రాధాన్యం
-కందుకూరి వీరేశలింగం స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు స్కూల్ కిట్స్ పంపిణీ

మెరుగైన విద్యను అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు తొలి ప్రధాన్యం ఇస్తారని నరసరావుపేట ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు అన్నారు.ఈ మేరకు నరసరావుపేట పట్టణం పాతురులోని కందుకూరి వీరేశలింగం పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించినప్పుడే సమాజం అభ్యున్నతి సాధిస్తుందని అన్నారు.జగన్ రెడ్డి హయాంలో విద్యను వ్యాపారంగా రాజకీయ ప్రచారానికి అవకాశంగా వాడుకున్నారని మండిపడ్డారు.ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను ఉద్ధరించినట్లు అడ్డమైన ప్రసారం చేసుకున్నారు.కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పై పెట్టి 16 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీకి చొరవ చూపారు.అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన ప్రతి విద్యా పథకాన్ని కూడా పునరుద్ధరిస్తారని చెప్పి చదువు పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు.

పిల్లల స్కూలు పుస్తకాల పై కూడా తన ఫోటో ముద్రించుకుని జగన్ రెడ్డి ఫోటో పిచ్చి చాటుకున్నారని ఎద్దేవా చేశారు.మాకు ఫోటోలు ముఖ్యం కాదు పేదలకు పేద పిల్లలకు మేలు జరగడమే ముఖ్యంని అన్నారు.అందుకే జగన్ ఫోటోలు ఉన్నాగాని విద్యా కిట్స్ ను పిల్లలందరికీ పంపిణీ చేస్తున్నామన్నారు.ప్రతి విద్యార్థి ఉన్నత విద్య అభ్యనిస్తే సమాజం కూడా మెరుగైన స్థితిలో ఉంటుందని అన్నారు.పిల్లలంతా కిట్స్ ను సక్రమంగా వినియోగించుకుని మెరుగని ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే అరవింద బాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి,కపిలవాయి విజయ్ కుమార్,వాసిరెడ్డి రవి,కాకుమాను వెంకట్రావు,కోడూరి రాము,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.