Mahanaadu-Logo-PNG-Large

150 సీట్లతో చంద్రబాబుకు పట్టం

భూ కబ్జా రాయుడు బొల్లా ఇంటికే..
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు

వినుకొండ: పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు జి.వి. ఆంజనే యులు, మక్కెన మల్లికార్జునరావు సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహిం చారు. ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మంగళవారంతో తొలగిపోతుందన్నారు. కూటమికి 150 పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే లు చెప్పాయన్నారు. అధికారులను బయపిస్తున్న సజ్జల రామకృష్ణ, పేర్ని నానిని జైలులో వేయాలని డిమాండ్‌ చేశారు. భూ కబ్జా రాయుడు బొల్లా పాలన ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని విమర్శించారు. మక్కెన మల్లికా ర్జునరావు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం నుంచి జీవీ, నరసరావుపేట పార్లమెంట్‌ నుంచి శ్రీకృష్ణ దేవరాయలు మంచి మోజార్టీతో గెలవబోతున్నార న్నారు. ఐదేళ్లలో జరిగిన అన్యాయంపై ప్రజల్లో వచ్చిన మార్పే అధికశాతం పోలింగ్‌కు కారణమన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు ప్రతిపక్ష పాత్రలో అయినా గౌరవంగా ఉండాలని హితవు పలికారు.