టీడీపీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

మంగళగిరి, మహానాడు : టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు శనివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు భారీ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్దిమంది నాయకుల్లో చంద్రబాబు నాయుడు ఒకరని, విజన్‌ 2020 పేరుతో నేడు ఇరు తెలుగు రాష్ట్రాలు సాధించబోయే అభివృద్ధికి ఏనాడో బీజాలు వేశారని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్ల పరిపాలనలో, విభజిత నవ్యాంధ్రలో ఐదేళ్ల పాలనలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతదేశ చిత్రపటంలో ఏపీని అగ్రగామిగా నిలిపిన ఘనత చంద్రబాబు దేనని ప్రశంసించారు.

కష్టాల సుడిగుండంలో ఉన్న నవ్యాంధ్రను ఒడ్డుకుచేర్చడానికి ఒక కర్మ యోగి లా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని అన్నారు. అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణాల తో పాటు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు. పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఓ సైకో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేశాడు. నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు. మరో నెలరోజుల్లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావటం ఖాయం. త్వరలోనే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రానున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మండలి మాజీ చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌, మాజీ ఎమ్మెల్సీలు పర్చూరి అశోక్‌బాబు, ఏ.ఎస్‌.రామకృష్ణ, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నేతలు నాదెండ్ల బ్రహ్మం, సయ్యద్‌ రఫీ, మన్నవ సుబ్బారావు, గురుమూర్తి, దారపనేని నరేంద్రబాబు, ఏవీ రమణ, పాతర్ల రమేష్‌, వల్లూరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.